Nature: ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన ప్రదేశాలివే..

దేవుడిచ్చిన వరం పకృతి. భారతదేశంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలకు కొదవ లేదు. దట్టమైన అడవులు, కొండప్రాంతాలు, నదులు, కొలనులు, సరస్సులు,జలపాతాలు, గృహాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

Published : 20 May 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేవుడిచ్చిన వరం పకృతి. భారతదేశంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలకు కొదవ లేదు. దట్టమైన అడవులు, కొండప్రాంతాలు, నదులు, కొలనులు, సరస్సులు, జలపాతాలు, గృహాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఇలాంటి ప్రాంతాలు కనులవిందు చేస్తాయి. తూర్పు నుంచి పడమర వరకూ, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ మన దేశంలో అద్భుతమైన విహార ప్రాంతాలు స్వాగతం పలుకుతున్నాయి. ఒత్తిడి, నిరాశ వంటి భావాల నుంచి బయట పడాలి అనుకునే వారికి ప్రకృతి విహారం మంచి   వైద్యంలా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. టీనేజర్స్‌ నుంచి పెద్దవారి వరకూ ఇలా విహార యాత్రలు చేయాలన్న అభిలాష అందరిలోనూ ఉంటుంది. సాహస యాత్రికులు, ఒంటరిగా ప్రయాణించేవారు, తమ వీకెండ్స్‌ను గడపాలనుకునేవారికి, వేసవి విడిదిగా పేరొందుతున్న కొన్ని ప్రాంతాలను చూద్దాం పదండి.

1.కూర్గ్‌ (కర్ణాటక)

ఇది పశ్చిమ కనుమల్లో ఉన్న దక్షిణ కర్ణాటకలోని ఒక చిన్న కొండ ప్రాంతం. దీన్ని స్కౌట్‌లాండ్‌ ఆఫ్‌ ఇండియా అని కూడా పిలుస్తారు. పచ్చని కాఫీతోటలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు పర్యాటకులకు ఈ ప్రాంతం స్వాగతం పలుకుతుంది.  ఇరుప్పు జలపాతం, నాగర్‌ హోలె నేషనల్‌ పార్క్‌, వన్యప్రాణుల అభయారణ్యాలు, పెద్ద వృక్షాల సముహంతో చూపరుల మనసును దోచుకుంటాయి.

2.యుమ్‌తంగ్‌ వ్యాలీ (సిక్కీం)

యుమ్‌తంగ్‌ వ్యాలీ దేశంలోనే అత్యంత అందమైన అట్టడుగు లోయ ప్రాంతం. ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చుట్టు కొండలు మధ్యలో లోయ ప్రాంతం అక్కడి ప్రజల వేష, భాషలు ప్రకృతి వైద్యం పట్టణ జీవనశైలిలో సతమతమయ్యే వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

 
3.లోనార్‌ సరస్సు (మహారాష్ట్ర)

లోనార్‌ సరస్సును లోనార్‌ కేటర్‌ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్కబిలం. అతిపెద్ద రాతి చీలికతో ఏర్పడిన సరస్సు‌. రెండువైపులా రాళ్లు ఉండి మధ్యలో ప్రవాహంలా ఉన్న దీని సోయగాలు వర్ణనాతీమైన అనుభూతులను ఇస్తాయి. ఇది మహరాష్ట్ర బుల్దానా జిల్లాలో ఉంది. దాదాపు 1832 మీటర్ల  పొడవు, 148 మీటర్ల లోతు ఉంది. దేశంలోనే అత్యంత జలసందర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.


4.నుబ్రా లోయ(లడఖ్‌)

ఇది టిబెట్‌, కశ్మీర్‌ మధ్య ఉంది. సుందరమైన పూలతోటలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఒంటెలు, దేవాలయాలకు ఇది ప్రసిద్ధి. మంచు పర్వతాలు నలువైపులా సరిహద్దుల్లా ఉంటాయి.

 
5.హోగెనకల్‌ జలపాతం (తమిళనాడు)

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో కావేరి నదిపై ఈ జలపాతం ఉంది. దేశంలోనే అత్యంత సుందరమైన జలపాతాల్లో ఇది ఒకటి. జలప్రవాహ శబ్దాలకు మనసు ఉత్తేజమవుతుంది. కొండ చరియల నుంచి నీరు పారుతున్న దృశ్యాలు పాల తెలుపును తలపిస్తాయి. ఈ ప్రదేశంలో పడవ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని