Health: ముక్కులో కండ పెరిగిందా..?

జలుబు చేసినపుడు ముక్కు బిగుసుకొని పోవడం తెలుసు..కానీ జలుబు లేకపోయినా ముక్కులో శ్వాసకు అడ్డు ఉన్నట్టు ఉంటుంది. 

Published : 19 May 2022 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జలుబు చేసినపుడు ముక్కు బిగుసుకొని పోవడం తెలుసు. కానీ.. ఒక్కోసారి జలుబు లేకపోయినా ముక్కులో శ్వాసకు అడ్డు ఉన్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు గాలి తీసుకోవడం కష్టంగా మారుతుంది. కారణం ముక్కులో ద్రాక్ష గుత్తుల్లా కండ పెరిగిపోయి శ్వాసకు ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని నాసల్‌ పాలిప్స్‌ అంటారని వైద్యులు చెబుతున్నారు. ముక్కులో కండ పెరగడానికి కారణాలు, పరిష్కార మార్గాలను ఈఎస్‌టీ సర్జన్‌ జానకి రామిరెడ్డి సూచించారు.

ఎందుకు వస్తాయంటే: ముక్కుదూలం ఒక పక్కకి వంగినపుడు ఒక నాళం చిన్నగా అవుతుంది. ఒక వైపు పెద్దగా ఉంటుంది. అటువైపు కండ పెరుగుతుంది. పాలిప్స్‌ వచ్చినపుడు కూడా ముక్కులో కండ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఇన్‌ఫెక్షన్లు ఉండటంతో ఇవి ఏర్పడతాయి.

ఇబ్బందులు ఇవీ: ముక్కులో పాలిప్స్‌ ఉండటంతో గాలి సరిగా ఆడదు. పాలిప్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయో పరిశీలించాలి. వీటితో గాలి ఒక్కటే కాదు..వాసన కూడా తెలియదు. ముక్కులో దురద అనిపించడంతో పాటు నీరు కారుతుంది. నొప్పి మాత్రం ఉండదు.

సర్జరీ అవసరం: గ్రేడ్‌-4 పాలిప్స్‌ వస్తే మాత్రం శస్త్రచికిత్స చేయించుకోవాలి. గ్రేడు 2,3 పాలిప్స్‌ వస్తే మందులతో తగ్గించడానికి వీలుంది. కొన్నిసార్లు ఆపరేషన్‌ కూడా అవసరం రావొచ్చు. 2-3 శాతం రోగుల్లో మాత్రమే మళ్లీ పాలిప్స్‌ తిరిగి వస్తాయి. అన్ని సీజన్లలోనూ అలర్జీలు ఉన్నపుడే పాలిప్స్‌ రావడానికి అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని