CM Jagan: పశువులకు అంబులెన్స్‌ సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్‌

వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published : 19 May 2022 13:31 IST

అమరావతి: వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్‌ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పశువులు అనారోగ్యానికి గురైతే సంప్రదించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962ను ఏర్పాటు చేశారు. తొలి విడతలో నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించనున్నారు. ఇందుకుగానూ రూ.143కోట్లతో 175 పశువుల అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. రెండో దశలో రూ.135 కోట్లతో మరో 165 అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్నారు. వాహనాల్లో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసే ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని