Amara Raja: అమరరాజా సంస్థపై ఎలాంటి బలవంతపు చర్యలొద్దు: సుప్రీం కోర్టు

ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పనిచేస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ వల్ల పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యంతో నిండిపోయాయని, ఎన్ని సార్లు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించకపోవడంతో సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ...

Published : 19 May 2022 22:09 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పనిచేస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ వల్ల పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యంతో నిండిపోయాయని, ఎన్ని సార్లు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించకపోవడంతో సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది ఫిబ్రవరి 21, 23 తేదీల్లో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై స్టే విధించింది. సంస్థపై తదుపరి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అమరరాజా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ.. ఏపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రధాన విద్యుత్ పంపిణీ కంపెనీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తయ్యేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని